బ్యాంకాక్‌లో బాలయ్య బంచిక్ బంచిక్.!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పట్లను పూర్తి చేసిన బాలయ్య త్వరలో చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రెండు విభిన్న పాత్రలు చేస్తున్న బాలయ్య, మధ్య వయసు పాత్రపై ఈ షెడ్యూల్ ఉండనుంది.

ఇక బ్యాంకాక్‌లో తీసేది ఏ యాక్షన్ సీనో కాదు. బాలయ్య, సోనాల్ చౌహాన్‌‌లపై ఒక సాంగ్‌ను ఈ షెడ్యూల్‌లో తీయనున్నారు. సోనాల్ చౌహాన్ గతంలోనూ బాలయ్యతో కలిసి లెజెండ్, డిక్టేటర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చే మూడో సినిమాలో వీరిద్దరి మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మంచి హాట్ సాంగ్‌తో ఈ చిత్ర షూటింగ్ మొదలెట్టనున్న బాలయ్య సరసన ఈ సినిమాలో మరో బ్యూటీ వేదిక నటించనుంది.

బ్యాంకాక్‌లో బాలయ్య చేసే బంచిక్ ఎలా ఉంటుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు. ఇక తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో బాలయ్య చేసే ఆ రెండు పాత్రలు ఎలా ఉంటాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment