కుర్ర హీరోతో ముదురు బ్యూటీ.. ఏమౌతాడో పాపం!

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల ఓ బేబీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో మనోడు చేసింది పెద్ద తోపు క్యారెక్టర్ ఏమీ కాదు. సమంత లాంటి స్టా్ర్ బ్యూటీ ముందు మనోడు ప్రేక్షకులకు కనిపించకుండా పోయాడు. అయితే మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి నాగశౌర్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోయేది ఎవరో తెలియాలంటే మేటర్‌లోకి వెళ్లాల్సిందే.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇటీవల సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. కాగా ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి ఓ సినిమా చేసేందుకు ఆయన రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నాగశౌర్యను కన్ఫమ్ కూడా చేశారట. వయసులో చాలా తేడా ఉన్న వీరిద్దరు ఆన్‌స్క్రీన్‌పై ఎలా చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. అయితే ఈ సినిమా మూడు కథల చుట్టూ తిరగనుందట.

అటు అనుష్క తన నెక్ట్స్ సినిమా ‘సైలెన్స్’ను రిలీజ్‌కు రెడీ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూఎస్‌లో జరుగుతోంది. అయితే రాఘవేంద్రరావు తెరకెక్కించే సినిమా ఎలాంటి కోవకు చెందిన సినిమాతో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందేనట.

Leave a comment