తారక్ నెక్ట్స్ ఫిక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ RRRలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2020లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అటు ఈ సినిమా తరువాత తారక్ ఎలాంటి సినిమా తీస్తాడా..? ఎవరికి ఛాన్స్ ఇస్తాడా అని ఆతృతగా ఎదురుచూశారు అభిమానులు. అయితే ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు సమాధానం దొరికింది.

తారక్ తన నెక్ట్స్ సినిమాను కొరటాల శివతో తెరకెక్కిస్తాడని అని అందరూ అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవితో కొరటాల సినిమా చేస్తుండటంతో ఆ సినిమా పూర్తయ్యే వరకు సమయం పడుతుంది. దీంతో తారక్-కొరటాల సినిమా కాస్త వాయిదా పడింది. ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తారక్ కోసం ఓ అద్భుతమైన కథను రెడీ చేసినట్లు.. అది విన్న తారక్ వెంటనే సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరి ఇప్పుడు మరోసారి రిపీట్ కానున్న ఈ కాంబో ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తారో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఏదేమైనా త్రివిక్రమ్‌తో తారక్ సినిమా కోసం అప్పుడే ఆతృతగా చూస్తున్నారు జనం.

Leave a comment