‘ సైరా ‘ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌..

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా టీజ‌ర్ మరికొన్ని గంటల్లో 5 భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 22 న చిరు బర్త్ డే కానుక‌గా మెగా ఫ్యాన్స్‌కు సూప‌ర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సినిమా మేక‌ర్లు రెడీ అయ్యారు. ఈ టీజ‌ర్ రిలీజ్ అవ్వ‌డం ఒక ఎత్తు అయితే… ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం మ‌రో బంప‌ర్ గిఫ్ట్‌. ఇంత‌కు మించి ఫ్యాన్స్‌కు ఏం కావాలి.

చిరు కెరీర్‌లో ఏకంగా రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియోతోనే అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మెగా ఫ్యాన్స్ టీజ‌ర్ రిలీజ్ కోసం చాలా హంగామా న‌డుస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ విష‌యంలో మెగా ఫ్యాన్స్‌కు షాక్ త‌ప్ప‌దు. ఈ టీజర్ రిలీజ్ కోసం సైరా యూనిట్ ఎటువంటి ఈవెంట్ చేయడంలేదు. ఎలాగూ 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో ఈ ఐడియా డ్రాప్ అయినట్టుగా వినికిడి.

సో సైరా టీజర్ ను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు యూనిట్ సభ్యులు. అక్టోబర్ 2 న ఈమూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు భాషల్లో బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయి. టీజర్ వచ్చాక అవి డ‌బుల్‌ అయ్యే అవకాశముంది.

Leave a comment