స్టార్ హీరో భార్య‌ను బుట్ట‌లో ప‌డేసిన ప్లాప్ డైరెక్ట‌ర్‌..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను తీసిన దర్శకులలో మెహర్ రమేష్ కూడా ఒకరు. కంత్రి – బిల్లా – షాడో – శ‌క్తి వంటి సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా లేదు. అత‌డు తీసిన సినిమాలు అన్ని భారీ డిజాస్ట‌ర్లు అయ్యాయి. అయితే అతడికి మంచి నెట్ వ‌ర్క్ ఉంది. మెగా ఫ్యామిలీకి ర‌మేష్ బంధువు కూడా అవుతాడు.

గత కొంత కాలంగా మహేష్ బాబు తో సన్నిహితంగా ఉంటున్న మెహర్ రమేష్ సూపర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఘోర‌మైన డిజాస్ట‌ర్ల‌తో పాటు ఫామ్‌లో లేని అత‌డితో సినిమా చేసేందుకు మహేష్ ఏం అంత తెలివిలేని వాడు క‌దుగా అన్న గుస‌గుస‌లు కూడా వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఈసారి మెహర్ రమేష్ సినిమాలతో కాకుండా ఒక వెబ్ సిరీస్‌తో అయినా త‌న ల‌క్ మారుతుందేమో ? అని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇందుకోసం మ‌హేష్‌బాబు భార్య నమ్రత ర‌మేష్ చెప్పిన కొన్ని వెబ్ సిరీస్‌ల‌ స్క్రిప్ట్ లను ఫైనలైజ్ చేశారు. సరైన భాగస్వామి దొరికితే ఆ వెబ్ సిరీస్ నిర్మించడానికి ఆమె సిద్ధంగా ఉంది.

వ‌రుస ప్లాపుల‌తో ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్తితి లేక‌పోవ‌డంతో మెహ‌ర్ ర‌మేష్ చివ‌ర‌కు న‌మ్ర‌త‌ను కాక‌ప‌ట్టేసి చివ‌ర‌కు వెబ్ సీరిస్‌లు అయినా తీసుకుందామ‌ని డిసైడ్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఇలా అయినా మెహ‌ర్ ర‌మేష్ క్లీక్ అయ్యి స‌త్తా చాటుతాడేమో ? చూడాలి.

Leave a comment