బ్రేకింగ్‌:కారు యాక్సిడెంట్‌లో రాజ్‌త‌రుణ్‌కు గాయాలు…. ఆందోళ‌న‌లో ఇండ‌స్ట్రీ

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్‌కు కారు ప్ర‌మాదంలో గాయాలైన‌ట్టు తెలుస్తోంది. రాజ్ త‌రుణ్ ప్ర‌యాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారు జామున రాజ్ త‌రుణ్‌ కారు డివైడర్‌ను డీకొట్టగా… ఈ ప్ర‌మాదంలో రాజ్‌కు చిన్న‌పాటి గాయాలైన‌ట్టు తెలుస్తోంది.

స్పీడ్‌గా వెళుతోన్న కారు రింగ్ రోడ్‌పై ఉన్న డివైడ‌ర్‌ను ఢీకొట్ట‌గా రాజ్‌త‌రుణ్ ఆ కుదుపుకు లోప‌ల గుద్దుకోవ‌డంతో గాయాలు అయిన‌ట్టు స‌మాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెపుతున్నారు. అయితే రాజ్ త‌రుణ్ త‌న కారు అక్క‌డే వదిలేసి వెళ్ల‌డంతో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసుల‌కు స‌మాచారం తెలియ‌డంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు. రాజ్‌కు గాయాలైన విష‌యం తెలియ‌డంతో ఇండ‌స్ట్రీలో ప‌లువురు రాజ్‌కు ఏమైందా ? అని ఆరా తీస్తున్నారు. ఆయ‌న స‌న్నిహితులైన హీరోలు, మిత్రులు రాజ్ ఫోన్ క‌ల‌వ‌క‌పోవ‌డంతో కాస్త ఆందోళ‌న‌తోనే ఉన్నారు.

రాజ్‌త‌రుణ్ ప్ర‌స్తుతం దిల్ రాజు బ్యానర్ లో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a comment