సాహోకి షాక్ ఇచ్చిన ఓవర్సీస్ ప్రీమియర్స్..!

అసలే ఈమధ్య తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పడిపోయిందన్న టాక్ వినిపిస్తుంటే ప్రభాస్ సాహోకి అది మరోసారి ప్రూవ్ అయ్యేలా ఉంది. ఓవర్సీస్ లో సాహోకి భారీ క్రేజ్ ఉంటుందని ఊహించగా ఆశించిన స్థాయిలో అక్కడ క్రేజ్ దక్కలేదు. దీనితోడు భారీ రేంజ్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేసినా టికెట్స్ మాత్రం పెద్దగా సేల్ అవట్లేదని తెలుస్తుంది. దీనికి కారణం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అని తెలుస్తుంది.

ప్రీమియర్స్ భారీగా ప్లాన్ చేసినా పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సాహోకి అక్కడ దెబ్బపడేలా ఉందట. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ క్రాస్ చేయాలనుకున్న మేకర్స్ ప్లాన్ కు గండి పడేలా ఉంది. ప్రభాస్ కేవలం బాలీవుడ్ ప్రమోషన్స్ మీదనే దృష్టి పెట్టి ఓవర్సీస్ ను లైట్ తీసుకున్నాడు. కనీసం ఒకసారైనా సరే అక్కడ సినిమా ప్రమోట్ చేసి ఉంటే పరిస్థితి బాగుండేదని అంటున్నారు.

అదీకాకుండా సాహో తెలుగు వర్షన్ కు యూఎస్ లో టికెట్ రేటు భారీగా ఉందట. తమిళ, హింది వర్షన్ సినిమాలకు నార్మల్ టికెట్ ప్రైజ్ ఉంచారట. ఇది కూడా కలక్షన్స్ షేర్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగులో మాత్రం సాహో సెన్సేషన్ సృష్టించేందుకు రెడీ అవుతుంది. తప్పకుండా మొదటిరోజు 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment