అడ్డుగోడలెత్తేసిన అదా శర్మ..!

కొంతమంది హీరోయిన్స్ కు అన్ని సమపాళ్లలో ఉన్నా సరే లక్ కలిసి రాక వెనుకపడిపోతుంటారు. అందం అభినయం అన్ని ఉన్నా సరే అదా శర్మ ఎందుకో కెరియర్ లో స్టార్ క్రేజ్ దక్కించుకోలేదు. బాలీవుడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన అదా శర్మ తెలుగులో పూరి హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయమైంది. అయితే ఆ సినిమాతో ఆడియెన్స్ ను మెప్పించినా ఆ తర్వాత సినిమాల సెలక్షన్స్ లో సరైన నిర్ణయాలు తీసుకోలేక వెనుకపడిపోయింది.

ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంది. తన ఇన్ స్టాగ్రాం లో హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది అదా శర్మ. లేటెస్ట్ గా ఓ బెంచ్ మీద బికినితో కనిపించిన అదా శర్మ గ్లామర్ విషయంలో ఇన్నాళ్లు ఉన్న అడ్డుగోడలను తోల్గించేసిందని చెప్పాలి. అమ్మడి ఈ క్రేజీ అటెంప్ట్స్ తనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెడుతుంది.

దీనితో పాటుగా ఓ హిట్టు సినిమా పడితే కెరియర్ కూడా సెట్ అవుతుంది. మరి దర్శక నిర్మాతలు అదా శర్మలోని టాలెంట్ ఎందుకు గుర్తించడం లేదో తెలియాల్సి ఉంది. సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేస్తా అంటూ అదా శర్మ అదరగొట్టేస్తుంది. బికినిలో ఇప్పటివరకు వేరే హీరోయిన్స్ స్టిల్స్ చాలా చూసినా దాచాల్సిన చోట దాస్తూ ఊరిస్తున్న అదా పిక్ మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పాలి. మరి ఈ క్రేజీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a comment