ఆ దేశంలో `సాహో` టిక్కెట్లు హాట్ కేకులే..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, శ్రద్ధా క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న `సాహో` చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నాడు. యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో ఫైప్ క్రియేట్ అయింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకి పాండే, జాకీ ష్రాఫ్ వంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సాహో అడ్వాన్స్‌ టికెట్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో సాగుతున్నాయి.

అదే విధంగా ఇతర దేశాల్లో కూడా అడ్వాన్స్‌ టికెట్ బుకింగ్స్ ఇదే ఫ్లో కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ల రిలీజ్‌ తరువాత మ‌రింత బ‌జ్ ఏర్ప‌డింది. మ‌రో వారంలో రోజుల్లో విడుద‌ల కాబోయే ఈ చిత్రానికి ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఆస్ట్రేలియాలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ఇండియ‌న్స్ ఎక్కువ‌గా ఉండే ఆస్ట్రేలియాలో సాహో టికెట్ బుక్కింగ్స్ హాట్ కేకుల్లా కొనుగోలు అవుతున్నాయి. నిజానికి బాహుబ‌లి ఎఫెక్ట్‌తో నేష్న‌ల్ స్టార్‌గా మ‌రిన ప్ర‌భాస్ క్రేజ్ కూడా సాహో సినిమాకు ప్ల‌స్ అవుతుంది.

అలాగే ఆస్ట్రేలియా లోని ప్రధాన నగరాలైన సిడ్నీ.. మెల్బోర్న్ లాంటి చోట్ల గతంలో ఎప్పుడు లేని విధంగా సాహో టికెట్ల బుక్కింగ్ క‌లెక్ష‌న్స్ ఓ రేంజ్‌లో కొన‌సాగుతున్నాయి. ఇక అమెరికాలో కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాకుండా మొత్తం అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండేలా క‌నిపిస్తున్నాయి. నిజానికి తెలుగు సినిమాలు ఆమెరికాలో మిగిలిన చోట్ల కంటే భారీగా వ‌సూళ్లు రాబ‌డ‌తాయి. అయితే ఈ సారి ఆస్ట్రేలియాలో సాహో రికార్డు క్రియేట్ చేస్తుండ‌డం అంద‌రికి షాక్ ఇస్తోంది.

Leave a comment