సరిలేరు నీకెవ్వరు సత్తా చాటుతా అంటున్న దేవి శ్రీ..!

మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ టాలెంట్ ఏంటన్నది మనకు తెలిసిందే. దేవి సినిమా నుండి ఈమధ్య వచ్చిన మహర్షి వరకు దేవ్ శ్రీ ప్రసాద్ తన సత్తా చాటుతున్నాడు. అయితే కెరియర్ మొదట్లో సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య రొటీన్ ట్యూన్స్ అందిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. అందుకే దేవి ఈసారి కసితో మ్యూజిక్ చేస్తున్నాడట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు డిఎస్పి.

ఈ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమా కమిట్ అవనని చెప్పాడట. తనకు ఇప్పటివరకు వచ్చిన క్రేజ్ బాగున్నా ఈమధ్య తను చేస్తున్న సినిమాల వల్ల తనకు చెడ్డపేరు వస్తుందని భావిస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అందుకే మహేష్ సినిమా పూర్తి చేసే వరకు వేరే సినిమా చేయట్లేదట. దేవి ఇలా ఛాన్స్ ఇచ్చాడో లేదో రీసెంట్ గా తమన్ కాస్త జోరందుకున్నాడు.

అతని మ్యూజిక్ లో కొత్తదనం కనిపిస్తుంది. కాని దేవి మాత్రం రొటీన్ గా కానిచ్చేస్తున్నడు. అందుకే సరిలేరు నీకెవరు సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నాడు డిఎస్పి. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ సినిమా నిర్ముస్తున్నారు.

Leave a comment