ధనుష్ చేసిన పనికి ఫైర్ అవుతున్న నాగ్..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కు కోలీవుడ్ హీరో ధనుష్ హాండిచ్చాడు.. ధనుష్ ఇచ్చిన హ్యాండ్ కు కింగ్ నాగార్జున షాకు తిన్నాడు. ఓ టాలీవుడ్ హీరోకు ఓ తమిళ హీరో హాండెందుకు ఇచ్చాడు.. ఏ విషయంలో ఇది జరిగింది… ధనుష్ వ్యవహరంతో కింగ్ నాగార్జున ఎందుకు షాక్ తిన్నాడు… అనేది సగటు అక్కినేని అభిమానులను, ఇటు ధనుష్ అభిమానుల మదిని తొలుస్తున్న ప్రశ్న.

ఇంతకు ఇద్దరి నడుమ ఏమి జరిగిందో ఎందుకు నాగ్ కు ధనుష్ షాక్ ఇచ్చాడో ఓసారి లుక్కేద్దాం. కింగ్ నాగార్జునతో ధనుష్ దర్శకుడిగా రుద్ర అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే రుద్ర సినిమా మల్టీస్టారర్ చిత్రంగా అనౌన్స్ చేశారు. కొంత భాగం కూడా చిత్ర నిర్మాణం జరిగింది. కానీ ఎందుకో ఏమో అనుకోకుండా చిత్ర షూటింగ్ నిలిచిపోయింది..

ఇంతకు రుద్ర సినిమా షూటింగ్ ఎందుకు ఆగిపోయిందో నాకు కూడా తెలియదని నాగార్జున అంటుండం చూస్తుంటే ధనుష్ కావాలనే ఈ సినిమాను ఆపాడని అర్థమవుతుంది. వాస్తవానికి ధనుష్ రుద్ర సినిమాను తన మామ తమిళ సూపర్‌స్టార్ రజనికాంత్ తో చేయాల్సిన ప్రాజెక్టు. కానీ రజనీకాంత్‌కు డేట్స్ కుదరకపోవడంతో ఈ కథను నాగ్‌కు వినిపించడం, తను ఓకే చేయడం జరిగింది. రుద్ర సినిమాకు సంబంధించిన కొంత భాగం కూడా షూటింగ్ జరిగింది. అందులో నాగ్ కూడా పాల్గోన్నాడు. కానీ సడన్‌గా ప్రాజెక్టు ఆగిపోయిందట. ఆ విషయం నాగ్‌కు కూడా తెలియద. ఇక ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టమేనట. దీంతో రుద్ర సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగ్‌కు భారీ షాకే అని చెప్పొచ్చు.

🙂

😀

Leave a comment