మరో బెల్లంకొండ బాబు దిగుతున్నాడు.. కాస్కోండి!

టాలీవుడ్‌లో అన్నయ్యల సపోర్ట్‌తో హీరోలుగా ఎదిగిన స్టార్లు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదలుకొని.. మొన్నటి ఆనంద్ దేవరకొండ వరకు చాలా మంది హీరోలు తమ అన్నయ్యల సపోర్టుతో ఇండస్ట్రీలో క్లిక్ అయ్యారు. అయితే ఇప్పుడు మరో బాబు హీరోగా తన అన్నయ్య సపోర్టుతో తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. యాక్షన్ హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ తన తమ్ముడు సాయి గణేష్‌ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. సాయి గణేష్ కోసం పవన్ సాధినేని అనే డైరెక్టర్ అదిరిపోయే లవ్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో బాబు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుంది. ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేస్తున్నా.. వెనుక నుండి కథ నడిపించేది బెల్లంకొండ సురేష్ అని ఇండస్ట్రీ టాక్.

ఏదేమైనా ఒక స్టార్ ప్రొడ్యూసర్, ఇమేజ్ ఉన్న అన్నయ్య సపోర్టు ఉంటే రాబోయే హీరోకు ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు సినీ క్రిటిక్స్. ఇక అతిత్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల తెలిపాడు.

Leave a comment