వర్మ దారిలోకి తేజను తీసుకొస్తున్న దిల్ రాజు…!

ఇదెక్కడి కథండి బాబోయ్… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దర్శకుడు తేజకు నడుమ ఏమైనా పొరపొచ్చాలొచ్చాయా..? సరేలే అనుకుంటే వర్మ దారిలోకి తేజను తీసుకురావాల్సిన అవసరం నిర్మాత దిల్ రాజుకు ఏంటీ…? వర్మ, తేజ మద్యలో దిల్ రాజు ఏంటి ఈ కథ అనుకుంటున్నారా..? వర్మ దారిలోకి తేజను తీసుకురావడానికి దిల్ రాజు చేసేదేమంటే…

అదేనండీ రామ్ గోపాల్ వర్మ త్వరలో తెరంగ్రేటం చేయబోతున్నాడు. కోబ్రా అనే సినిమాలో రామ్గోపాల్ వర్మ నటుడిగా రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు కూడా తేజను నటుడిగా చేయాలని ఆలోచన చేస్తున్నాడట. అందుకు తగిన విధంగా దర్శకుడు తేజకు సంబంధించిన పాత్ర స్క్రిప్ట్ రెడి చేయించాడట.

అంటే దిల్ రాజు నిర్మాతగా తదుపరి నిర్మాణం చేయించే సినిమాలో దర్శకుడు తేజ నటించబోతున్నాడన్న మాట. గతంలో ఎందరో అగ్ర దర్శకులు కూడా సినిమాల్లో నటించిన తమ స్టామినాను నిరూపించుకున్నారు. అందులో ప్రధానంగా దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, భీమనేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్ నటించి మెప్పించారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కూడా నటుడిగా మారబోతున్నాడు. ఇక వర్మ కూడా ఓకే.. సో వర్మ దారిలో తేజ నడువబోతున్నాడన్నమాట. మరి తేజ ఏం నటిస్తాడా…లేక దిల్ రాజకు షాక్ ఇస్తాడా వేచి చూద్దాం.

Leave a comment