ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో చూడనిది..?

ప్రభాస్ హీరోగా వస్తున్న సాహో సినిమా 30న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాహో తర్వాత చేస్తున్న జాన్ సినిమా గురించి ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా 1960-70 కాలం నాటి రోమ్ కథతో వస్తుందట. అయితే మొదటి షెడ్యూల్ రోమ్ లో షూటింగ్ జరుపగా అక్కడ షూటింగ్ కష్టమవుతుందని హైదరాబాద్ శివార్లలో ఆ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.

సాహో ప్రమోషన్స్ లో జాన్ సినిమా ప్రస్థావన తెచ్చిన మీడియా వాళ్లకు సమాధానంగా ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో చూడని ఓ స్పెషల్ థింగ్ తన రాబోయే సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్. అలా చెప్పి ఆ సినిమా మీద కూడా అంచనాలు పెంచేశాడు మన యంగ్ రెబల్ స్టార్. జిల్ తో తన సత్తా చాటిన రాధాకృష్ణ ప్రభాస్ తో మరో సెన్సేషనల్ మూవీ సిద్ధం చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటిస్తుంది. సినిమాను యువి క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు. కృష్ణం రాజు సమర్పణలో ఆ సినిమా తెరకెక్కుతుంది. చూస్తుంటే ఆ సినిమాను కూడా ప్రభాస్ తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీగా రిలీజ్ చేసేలా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Leave a comment