రిలీజ్ కు ముందు సాహోకి పెద్ద దెబ్బ..!

మరో మూడు రోజుల్లో సాహో రిలీజ్ కాబోతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సాహో. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా గురిచి ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించడంతో సినిమా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది.

అయితే సరిగా రిలీజ్ ముందు ఈ సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందురోజే ప్రీమియర్స్ వేస్తారు. స్టార్ సినిమాలకు అన్నిటికి ఇలానే జరుగుతుంది. అయితే ఈమధ్య కొత్తగా ట్వీట్ రివ్యూస్ అంటూ వేస్తున్నారు. ఈ ట్వీట్ రివ్యూస్ ప్రీమియర్స్ నుండే వస్తాయి. సినిమా మీద ఆడియెన్స్ ఓ ఒపినియన్ ఏర్పరచే ఈ ట్వీట్ రివ్యూస్ కూడా దర్శక నిర్మాతలతో బేరసారాలు ఆడుతున్నారు. తమకు యాడ్స్ ఇస్తేనే సినిమాకు పాజిటివ్ ట్వీట్ రివ్యూస్ వేస్తామని చెబుతున్నారట.

ఓవర్సీస్ టాక్ పై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉందా అన్న ప్రశ్న అటుంచితే ట్వీట్ రివ్యూస్ వల్ల కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ మీద దెబ్బపడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి సాహో నిర్మాతలు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Leave a comment