అఖిల్ సినిమాకు ఫ్యూజులు ఎగిరిపోయే రేటు చెప్పిన పూజా..!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో పెద్దగా క్రేజ్ తెచ్చుకోని పూజా అల్లు అర్జున్ డీజే సినిమాతో దుమ్ముదులిపేసింది. ఆ సినిమాలో అమ్మడి బికిని లుక్స్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది.

ఇక అప్పటినుండి పూజా హెగ్దె వరుస స్టార్ సినిమాల ఛాన్సులు అందుకుంది. తారక్, మహేష్ వంటి స్టార్స్ తో నటించిన పూజా హెగ్దె ప్రస్తుతం ప్రభాస్ జాన్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటుగా అఖిల్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. హీరోగా మూడు సినిమాలు తీసినా అఖిల్ 3 సినిమాలతో కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. భాస్కర్ సినిమా మాత్రం అరదరగొట్టేస్తుందని అంటున్నారు.

అయితే సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె చేసేందుకు ఆమె ఏకంగా 3.5 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తుందట. టాలీవుడ్ లో అమ్మడి డిమాండ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. అయితే ప్రస్తుతం హాట్ అండ్ స్వీట్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేస్తున్న పూజానే ఈ సినిమాకు పర్ఫెక్ట్ అని ఆమె అడిగిన రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. పూజా హెగ్దె ఆల్రెడీ నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది.

Leave a comment