ఆ క్రేజీ హీరోతో శ‌ర్వానంద్ వార్‌…

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. ఇండియన్ స్క్రీన్‌పై హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో సాహోపై లెక్కకు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్న సాహో యూనిట్ ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించింది.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు డబ్బింగ్…. ప్రమోషన్ స్టార్ట్ కాకపోవడంతో నెల రోజుల వ్యవధిలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌లేమ‌ని డిసైడ్ అయిన‌ చిత్ర యూనిట్… ఈ క్రమంలోనే రెండు వారాలు ఆలస్యంగా ఆగస్టు 30 నా సాహో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సాహో రిలీజ్ కావాల్సిన ఆగస్టు 15న మరో రెండు సినిమాలు ఖ‌ర్చీఫ్ వేసేశాయి.

సాహో వాయిదా ప‌డ‌డంతో ముందుగా శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం సినిమాను దించేశారు. శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా నటిస్తున్న రణరంగం చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ మూవీని ఆగస్టు 2న విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు లేట్ అవ్వ‌డంతో ఆగ‌స్టు 15 క‌రెక్ట్ డేట్ అనుకున్నారు.

ఇక మరో యంగ్ హీరో అడివి శేషు కూడా ఎవరు చిత్రాన్ని ఆగస్టు 15 నే విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగ‌స్టు 23న రిలీజ్ అనుకున్నా… ఓ వారం రోజులు ముందుకు జ‌రిపారు. మ‌రి ఈ ఇద్ద‌రు యంగ్ హీరోల బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో ? చూడాలి.

Leave a comment