కార్తీకేయ సూప‌ర్ రొమాంటిక్ + యాక్ష‌న్ = గుణ 369 ట్రైల‌ర్

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన యువహీరో కార్తికేయ ‘హిప్పీ’ సినిమాతో అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. తాజాగా కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘గుణ 369’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు కార్తికేయ. అనాఘ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.

ప్రేమ, విలన్, కాపాడుకోవడం లాంటి కాన్సెఫ్ట్‌తోనే సినిమా తెర‌కెక్కింద‌ని ట్రైల‌ర్ చెప్పేస్తోంది. హీరో – హీరోయిన్ల మ‌ధ్య హాయిగా సాగిపోయే లైఫ్, ప్రేమ, అంతలో అనుకోని పరిణామాలు, ఆ పైన యాక్షన్‌తో చివ‌ర‌కు ప్రేమ ఎలా గెలుస్తుంద‌న్న కోణంలోనే ట్రైల‌ర్ క‌ట్ చేశారు. సినిమా క‌థ మ‌రీ కొత్త‌గా లేక‌పోయినా ట్రైల‌ర్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ క‌లుగుతోంది.

కార్తీకేయ హీరోయిన్ల‌తో ల‌వ్ సీన్ల‌తో పాటు యాక్ష‌న్ సీన్ల‌లోనూ గ‌త సినిమాల కంటే కొత్త‌గా న‌టించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి హిప్సీతో డిజ‌ప్పాయింట్ చేసిన కార్తీకేయ మ‌ళ్లీ గుణ 369తో ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ అందుకుంటే మ‌నోడి క్రేజ్ మ‌ళ్లీ హై లెవ‌ల్లోనే ఉంటుంది. హీరోయిన్ అనాఘ కూడా చాలా అందంగా క‌నిపిస్తోంది. యూత్‌లో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Leave a comment