టాలీవుడ్‌కు బిగ్ షాక్‌: సాహో వాయిదా..?

అనుమానాలు నిజమయ్యాయి… అనుకున్నంతా అయ్యింది. నెల రోజుల కంటే తక్కువ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను ఎలా ప్రమోషన్ చేస్తారా అన్న సందేహాలు ముందునుంచి సాహో సినిమా విషయంలో వినిపించాయి. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే సాహో సినిమా ముందుగా అనుకున్నట్లుగా ఆగస్టు 15న కాకుండా… రెండు వారాలు ఆలస్యంగా ఆగస్ట్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

నిర్మాణానంతర పనుల‌తో పాటు డబ్బింగ్ వర్క్… విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి.మొత్తం మూడు భాష‌ల్లో ప్ర‌మోష‌న్‌తో పాటు డ‌బ్బింగ్ ప‌నులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత త‌క్కువ టైంలో హ‌డావిడిగా సినిమాను రిలీజ్ చేయ‌డం కంటే వాయిదా వేయ‌డ‌మే బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి చిత్ర యూనిట్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సాహో కోసం అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

ఇండియ‌న్ స్క్రీన్ మీద ఇప్ప‌టి వ‌ర‌కు రాని భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక సాహో వాయిదాపై నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ క్ర‌మంలోనే సాహోని ఆగస్ట్ 30కి లాక్ చేసినట్టుగా తెలిసింది. ఈ సినిమా కోసం యేడాది కాలంగా ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న డార్లింగ్ అభిమానుల‌తో పాటు ఇండియ‌న్ సినిమా యాక్ష‌న్ ప్రియుల‌కు ఇది పెద్ద షాకింగ్ న్యూసే. మ‌రో రెండు వారాలు వాళ్లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

Leave a comment