ఓ బేబీ కలెక్షన్.. టాలీవుడ్ లో వసూళ్ళ బీభత్సం..

సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం ఓ బేబీ. అక్కినేని సమంత నటించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలు అవుతుంది. రెండు వారాలు గడిచినా ఈ సినిమా ఇప్పటికి రష్ బాగానే ఉంది. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ పొంది రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు మరోమారు రెండు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పడు పెద్ద సినిమాగా మారింది.

సమంతకు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్, అక్కినేని కుటుంబంకు ఉన్న అభిమానగణం, సురేష్ ప్రోడక్షన్పై ఉన్న నమ్మకంతో ఓ బేబీ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో రెండువారాల్లో ఓ బేబీ రూ.35కోట్లను వసూళ్ళను దాటిందట. ఈ చిత్రాన్ని ఓ కొరియన్ చిత్రం కు రీమేక్ సినిమాగా తీసారు. దర్శకురాలు నందినిరెడ్డి ఎంతో జాగురుకతో సినిమాను ఆది నుంచి హాస్యాన్ని పంచేలా తెరకెక్కించారు. ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఓ బేబీ సినిమా ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

కేవలం షోలతోనే ఈ సినిమా రూ.35కోట్ల వసూలు చేసిందంటే ఇది ఒక రికార్డుగానే సిని పండితులు భావిస్తున్నారు. రూ.35కోట్ల వసూలు చేయడంతో చిత్రయూనిట్ పట్టరాని సంతోషంతో పొంగిపోతోంది. రెండువారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోనూ ఫుల్ రష్తో సాగుతున్న ఈ చిత్రం మరిన్ని వసూలు చేసే దిశగా దూసుకుపోతుంది.

86

Leave a comment