వామ్మో పూజా..మరీ అంత పెంచేసిందా..?

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా..బాలీవుడ్ జాతకాన్ని పూర్తిగా మార్చింది. ఇంతకీ బాలీవుడ్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నా..హాట్ బ్యూటీ పూజా హెగ్డే. తెలుగు లో ఒక లైలా కోసం, ముకుందా సినిమాల్లో నటిస్తే పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’సినిమాలో బికినీతో పిచ్చెక్కించిన ఈ భామ తర్వాత వెనక్కి చూసుకోలేదు.

వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. ఎన్టీఆర్,మహేష్ బాబు, ప్రభాస్ మరోసారి అల్లు అర్జున్ తో ఇలా వరుసగా ఛాన్సులు దక్కించుకుంటుంది. దాంతో ఈ హాట్ బ్యూటీకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా పూజా హెగ్డే 10 రోజులకు ఎంత తీసుకుంటుందో తెలుసా..? హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న వరుణ్ తేజ్ సినిమా వాల్మీకి సినిమాకి పూజా కోసం 10 రోజులు కాల్షీట్లు అడిగితే కోటిన్నర ఇస్తే కానీ కుదరదని చెప్పిందట.

ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న డిమాండ్ ప్రకారం కమిట్ అవ్వక తప్పదా..10 రోజులకు కోటిన్నర ఏంటి అని నెత్తినోరు బాదుకుంటున్నారు ప్రొడ్యూసర్లు. ఏం చేస్తారు క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాలంటే కోటిన్నర పెట్టక తప్పదు అనుకుంటూ.. అడిగిన దానికి ఓకే అనేశారట ప్రొడ్యూసర్లు. ఏది ఏమైనా అందం మంచి ఊపులో ఉన్నపుడే కాస్త డబ్బు వెనుకేసుకోవాలనే సూక్తి పూజా బాగా ఫాలో అవుతున్నట్టుంది.

Leave a comment