Moviesఇస్మార్ట్ శంకర్ రివ్యూ & రేటింగ్

ఇస్మార్ట్ శంకర్ రివ్యూ & రేటింగ్

సినిమా: ఇస్మార్ట్ శంకర్
నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
నిర్మాతలు: పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాధ్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పాత్ర హైలైట్ కానుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వచ్చింది. ఛార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
జైలు నుంచి తప్పించుకున్న శంకర్(రామ్ పోతినేని) పోలీసులను తప్పించుకుని తిరుగుతాడు. కాగా సైంటిస్ట్‌గా పనిచేసే నిధి మెదడుకు సంబంధించి పరిశోధనలు చేస్తోంది. కట్ చేస్తే.. కొందరు రౌడీలతో చేసిన ఫైట్‌లో శంకర్ గాయపడుతాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా.. అతడి మెదడులో డ్యుయల్ మెమరీని ఇన్‌సర్ట్ చేస్తారు. కొన్ని కారణాల వల్ల రామ్‌ నిధిని కిడ్నాప్ చేస్తాడు. అసలు శంకర్ మెదడులో డ్యుయల్ మెమరీని ఎందుకు పెట్టారు.? నిధి అగర్వాల్‌‌ను శంకర్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు..? నభా నటేష్‌తో శంకర్ పరిచయం ఎందుకు పెంచుకుంటాడు..? అనే అంశాలు తెలియాలంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
పూరీ జగన్నాథ్ మార్క్ చిత్రంగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్, ఆ ఫ్లోను ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. సినిమా మొదట్నుండీ హీరో పాత్రను ఎలివేట్ చేసే విధానంతో పూరీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇక కథ విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో హీరో ఇంట్రొడక్షన్ మొదలు.. హీరోయిన్లతో అతడు చేసే రొమాన్స్.. మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లే విధానంతో దర్శకుడు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడు. పూరీ మార్క్ డైలాగులతో మాస్ ప్రేక్షకులు థియేటర్లలో రచ్చ చేస్తారు. అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ రావడం.. అసలు కథ అక్కడినుండి మొదలు కావడంతో సెకండాఫ్‌పై చాలా ఆసక్తి ఏర్పడుతుంది.

ఇక సెకండాఫ్‌లో శంకర్‌ సీబీఐ నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. అటు నిధి అగర్వాల్‌ సహాయంతో ఒక క్రైమ్ విషయంలో ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అతడు చేసే ఇన్వెస్టిగేత్ దేనికి సంబంధించిందో మనకు క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు డైరెక్టర్ పూరీ. ఈ క్రమంలో ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను ముగించాడు పూరీ జగన్నాథ్. తన మార్క్ సినిమాల్లో ఉండే ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ సినిమాలో మిస్ కాకుండా చూశాడు దర్శకుడు పూరీ.

టెంపర్ తరువాత ఆ స్థాయిలో మరోసారి మెప్పించాడు దర్శకుడు పూరీ. రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ల అందాల ఆరబోత, ట్విస్టులతో కూడిన కథనం.. కలగలిసి పూరీ దగ్గర్నుండి ఎక్స్‌పెక్ట్ చేసే కథను ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో మనం చూడవచ్చు. ఓవరాల్‌గా పూరీ ఫ్యాన్స్, రామ్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చే సినిమాగా ఇస్మార్ట్ శంకర్ నిలిచాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
టాలీవుడ్‌లో ఎనర్జీకి కేరాఫ్‌గా నిలిచే హీరో రామ్, ఈ సినిమాలో మరింత ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయాడు. ఇక రామ్ నుండి ఎలాంటి సినిమా కోసం ఫ్యాన్స్ ఇంత కాలం వెయిట్ చేశారో.. అలాంటి సినిమాతో మనముందుకు వచ్చాడు ఈ హీరో. పూర్తిగా మాస్ అవతారంలో, తెలంగాణ యాసలో ఇస్మార్ట్ శంకర్ పాత్రలో జీవించేశాడు. పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో పాటు అదరగొట్టే యాక్షన్ సీన్స్‌లోనూ మనోడు దుమ్ములేపాడు. హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్‌లు కూడా మంచి పాత్రలను దక్కించుకున్నారు. ముఖ్యంగా నిధి అగర్వాల్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే పాత్రలో నటించింది. అటు అందాల ఆరబోతలో హీరోయిన్లు ఇద్దరు పోటీ పడ్డారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
పోకిరి, టెంపర్ వంటి సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ గతకొంత కాలంగా ఫేడవుట్ అవుతూ వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూసిన పూరీ.. సినిమాను తనదైన మార్క్‌లో తెరకెక్కించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. పూరీ మార్క్ హీరో ఎలివేషన్‌లతో సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. మాస్ సినిమా అంటూ చెప్పుకొచ్చిన దర్శకుడు ఆ ఫ్లోను ఎక్కడా మిస్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మొత్తానికి పూరీ నుండి ఆశించిన సినిమా ఎట్టకేలకు మనకు ఇస్మార్ట్ శంకర్ ద్వారా వచ్చింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు మరో మేజర్ అసెట్. ప్రతి సీన్‌ను చక్కగా చూపించారు. మణిశర్మ అందించిన మ్యూజిక్ మరో అసెట్. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
ఇస్మార్ట్ శంకర్: మాస్… ఊరమాస్!

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news