బ్లాక్ అండ్ బ్లాక్ ప్రభాస్.. అక్కడ బుక్కయ్యాడుగా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఇండిపెండెన్స్ డే కి ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే కానుక ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ప్రభాస్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈమధ్యనే ఆస్ట్రేలియాలో పాట షూట్ చేసుకుని రిటర్న్ అయ్యారు.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో ప్రభాస్ కెమెరా కంట పడ్డాడు. సాహో లుక్ లోనే ప్రభాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. పైన క్యాప్ నుండి మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లో ప్రభాస్ అదరగొట్టాడు. షూస్ ఒక్కటే వైట్ గా ఉన్నాయి మిగతా అంతా బ్లాక్ రంగులో మునిగిపోయాడు ప్రభాస్. ఈ బ్లాక్ పిక్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.

ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సాహో ఒకటి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాగా వస్తున్న సాహో సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమాలో స్పెషల్ సాంగ్ లో కియరా అద్వాని నర్తిస్తుందని తెలుస్తుంది. మరి ప్రభాస్ సాహో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

pbs

Leave a comment