‘ ఓ బేబీ ‘ వ‌ర్సెస్ ‘ బుర్ర‌క‌థ‌ ‘… ఏది హిట్‌.. ఏది ఫ‌ట్‌..

ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో రెండు సినిమాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు బాక్సాఫీస్ వ‌ద్ద రిలీజ్ అయ్యాయి. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఓ బేబీ. ఈ సినిమాకు నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడిగా మారి ఆది హీరోగా రూపొందించిన బుర్ర‌క‌థ‌. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకున్న ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుడిని మెప్పించింది.. ఏది బోర్ కొట్టించిందో చూద్దాం.

ముందుగా స‌మంత ఓ బేబీ విష‌యానికి వ‌స్తే హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా. సినిమాలో ఎమోషన్స్,కామెడీ,రొమాన్స్ వాల్యూస్ ఇలా అన్ని కోణాలు కలగలిపి ఒక కంప్లీట్ మూవీని నందిని రెడ్డి ప్రెసెంట్ చేశారు. సమంత యంగ్ ముస‌ల్దిగా న‌ట‌నలో చంపేసింది. జీవితమంతా అనేక కష్టాలు అనుభవించి.. తన బిడ్డను తీర్చిదిద్ది.. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఒక తల్లి చివ‌ర‌కు ఆ కుటుంబానికే భారంగా మారిపోతుంది. ఈ స్థితిలో తిరిగి య‌వ్వ‌నాన్ని పొంది… తాను కోల్పోయిన ఆనందాల‌ను అనుభ‌వించేందుకు చేసే ప్ర‌య‌త్నాన్ని ద‌ర్శ‌కురాలు నంద‌నీరెడ్డి చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేసింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల వైపు ప‌రుగులు పెట్టిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇక గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న ఆది సాయికుమార్‌కు బుర్ర‌క‌థ రూపంలో మ‌రో బుర్ర తినే సినిమా త‌గిలింది. ఆది హీరోగా మిస్తీ చక్రబోర్తి – నైరా షా హీరోయిన్స్ గా వచ్చిన ఈ సినిమాలో అంత ఆస‌క్తిగా సాగ‌లేదు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు రాసుకున్న క‌థ బాగున్నా క‌థ‌నంలో ఏ మాత్రం ఆస‌క్తి లేక‌పోవ‌డం… క‌థ‌తో సంబంధం లేని కామెడీ వెగ‌టు పుట్టిస్తుంది. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్. సినిమా స్టోరీ పాయింట్ కి తగ్గట్లు ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడంతో ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం క‌ష్ట‌మే అని తొలి షోకే తేలిపోయింది.

ఫైన‌ల్‌గా ఈ శుక్ర‌వారం సినిమాల్లో ఓ బేబీ సూప‌ర్ బేబీ అన్న టాక్ తెచ్చుకుంటే… బుర్ర‌క‌థ బుర్రతినే సినిమాగా టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతానికి ఈ రెండు సినిమాల టాక్ ఇలాగే ఉంది. మ‌రి ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే స‌రికి రెండు సినిమాల బాక్సాఫీస్ స‌త్తా కూడా తేలిపోనుంది.

Leave a comment