కొత్త అవతారం.. కొత్త మాటలు.. వైరల్ అవుతున్న నిత్యా మీనన్ #SelfLove కాన్సెప్ట్..!

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ నిత్యా మీనన్. మంచి నటిగా అనతికాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న నిత్యా మీనన్ గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. చేతిలో అవకాశాలు ఉన్నా లేకున్నా తనని వెతుక్కుంటూ వచ్చే సినిమాలే చేస్తా అంటుంది నిత్యా మీనన్. రీసెంట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్రలో నటించిన నిత్యా మీనన్ లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండ డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేసింది.

రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఇలాంటి టైంలో నిత్యా మీనన్ మళ్లీ ఫాంలోకి వస్తుందా అనుకున్నారు. కాని తన న్యూ లుక్ తో అందరికి షాక్ ఇస్తుంది నిత్యా. కొత్త అవతారమే కాదు కొత్త కొత్త మాటలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఎవరెవరినో ప్రేమించడం ఎందుకు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అంటూ #SelfLove ను ప్రమోట్ చేస్తుంది నిత్యా మీనన్. నిత్యా చెప్పిన సెల్ఫ్ లవ్ కాన్సెప్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే నిత్యా మీనన్ నితిన్ ఓన్ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందట. ఇదే కాకుండా కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా నిత్యా సినిమాల ఎంపికలో వెనుకపడటంతో ఆడియెన్స్ కు దూరమవుతూ వచ్చింది. మరి మళ్లీ నిత్యా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.

Leave a comment