ఓ బేబీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. సమంత లాగేసిందిగా!

అక్కినేని కోడలు సమంత అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ బేబీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సాధించింది. మొదట్నుండీ సినిమాపై మంచి బజ్ ఏర్పడటం.. సమంత లీడ్ రోల్‌లో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోటా మంచి రెస్పాన్స్‌ను సాధించి విజయం అవలీలగా అందుకుంది.

ఓ బేబీ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే వారం దాటింది. దీంతో ఈ సినిమా ఎంత వసూలు చేసిందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 90శాతం కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా ఫస్ట్ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.11.46 కోట్లు వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 3.05 కోట్లు
సీడెడ్ – 0.95 కోట్లు
నెల్లూరు – 0.22 కోట్లు
కృష్ణా – 0.67 కోట్లు
గుంటూరు – 0.48 కోట్లు
వైజాగ్ – 1.10 కోట్లు
తూ.గో – 0.47 కోట్లు
ప.గో – 0.39 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 7.33 కోట్లు
యూఎస్ఏ – 2.43 కోట్లు
ఆస్ట్రేలియా – 0.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 11.46 కోట్లు

Leave a comment