ఎన్టీఆర్‌ను తుక్కుతుక్కుగా కొడతానంటున్న చెర్రీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో RRR సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా కోసం వారిద్దరు చాలా ట్రైనింగ్ తీసుకుంటున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలో వారి పాత్రలు చిరస్థాయిగా గుర్తుండిపోవడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. వెండితెరపై ఎన్టీఆర్‌ను తుక్కుతుక్కుగా కొడతానంటున్నాడు చరణ్. ఇంతకీ ఈ విషయం ఏమిటో తెలుసుకుందామా.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా ‘రామాయణం’ 3D చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రాముడిగా రామ్ చరణ్‌ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రకు ఒక్క ఎన్టీఆర్ తప్పితే ఇంకెవరూ న్యాయం చేయలేరని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘జై లవకుశ’ సినిమాలో మోడ్రన్ రావణ్‌గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ త్రీడీ మూవీలో పాత రావణుడిగా తారక్ మాత్రమే న్యాయం చేయగలడని వారు అంటున్నారు.

ఈ సినిమా గనక ఓకే అయితే వెండితెరపై రావణుడిని రాముడు తుక్కు్తుక్కుగా కొట్టనున్నాడు. అంటే.. ఎన్టీఆర్‌ను చరణ్ కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవని అంటున్నారు. కానీ.. ఈ సినిమాలో సీత పాత్రలో నయనతారను ఓకే చేసిన చిత్ర యూనిట్‌కు చరణ్ షాక్ ఇచ్చాడు. తనకంటే కొంచెం ఏజ్ ఎక్కువ కనిపించే నయన్‌తో చరణ్ కాంబినేషన్ సెట్ కాదని.. అతడు సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి రాముడి పాత్రలో ఎవరు నటిస్తారు.. బాక్సాఫీస్ రావణుడిని ఎవరు ఢీకొట్టగలరు అనే విషయం ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Leave a comment