ఇండియా ఓడిపోవడానికి అసలు కారణం ఆమె..?

క్రికెట్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు తుదిపోరుకు సిద్ధమయ్యాయి. కాగా న్యూజీలాండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా భారత్ ఓటమికి అనేక కారణాలు చెబుతున్నారు ప్రేక్షకులు. అయితే టీం ఇండియా ఓడిపోవడానికి ఒక స్టార్ బ్యూటీనే కారణమంటున్నాడు ఓ సినీ క్రిటిక్.

బాలీవుడ్ సినీ క్రిటిక్ కమాల్ ఖాన్ ఇండియా ఓటమికి అసలు కారణం.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అని అంటున్నాడు. గతంలోనూ అనుష్క శర్మ 2015 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించింది. అప్పుడు కూడా ఇండియా ఓటమి పాలైంది. ఇప్పుడు 2019లోనూ భారత్-కివీస్ సెమీఫైనల్ మ్యాచ్‌ను వీక్షించింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓటమిపాలైందంటూ తనదైన శైలిలో సెటైర్ విసిరాడు.

ఏదేమైనా భారత్ ఓటమికి బాలీవుడ్ బ్యూటీని లింక్ పెడుతూ కమాల్ ఖాన్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలే భారత జట్టు ఓడిపోయిందని కోపంలో ఉన్న ఫ్యాన్స్‌కు మరింత కోపం తెప్పించాడు ఈ క్రిటిక్. మరిదీనిపై ఎవరెవరు ఎలాంటి కామెంట్ చేస్తారో చూడాలి.

Leave a comment