నాగ్ షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..?

తెలుగు లో ఆ మద్య సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ సీక్వెల్ గా ఓ సినిమా తీయాలని అప్పట్లో భావించారు..కానీ కుదరలేదు. ఈ లోగా నాగ్ మరో సినిమాకు కమిట్ కావడం జరిగింది. ప్రస్తుతం రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మధుడు2’లో నటిస్తున్నారు నాగార్జున. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ ‘బంగార్రాజు’మూవీలో నటించబోతున్నారు.

ఆ మూవీలో ఈ పాత్రకే మంచి ప్రాధాన్యత రావడంతో అదే పేరుపై సినిమా తీస్తున్నారు. ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగార్జున సరసన పూజా హెగ్డేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నాగచైతన్య సరసన కీర్తి సురేష్ ఎప్పుడో ఖరారైపోయింది. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్.. కానీ ఇటీవల కళ్యాణ్ కృష్ణ.. కీర్తి సురేష్ కు ఫైనల్ నేరేషన్ వినిపించాడట.

తన పాత్రని తీర్చిదిద్దిన విధానానికి కీర్తి అసహనం వ్యక్తం చేసిందట. ఈ మూవీలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనందున బంగార్రాజు మూవీకి కీర్తి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కళ్యాణ్ కృష్ణ మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడట.

Leave a comment