సినిమాలకు గుడ్ బై చెప్పిన మెగా డాటర్..

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో ఏకంగా ఓ క్రికెట్ జట్టు టీంగా మెగా హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిరు అల్లుడు స‌త్య‌దేవ్‌ వరకు 11 మంది హీరోలు ఫ్యామిలీ నుంచి ఉన్నారు. వీరిలో చాలా మందికి ప్రేక్షకులు మ‌ద్ద‌తు… అభిమానుల ఆశీస్సులు ఉన్నాయి. అందుకే వారంతా స్టార్ హీరోలు ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్…. నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. మెగా ఫ్యామిలీ అభిమానుల సపోర్ట్ ఆమెకు ఏమాత్రం లేకుండా పోయింది.

హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న‌ ఆమెకు తన తండ్రి నాగబాబు ఎంత మాత్రం అడ్డుచెప్పలేదు. అన్న వ‌రుణ్‌తేజ్‌ కూడా ఎంక్రేజ్‌ చేశాడు. చివరకు మ‌రో అన్న రామ్‌చ‌ర‌ణ్‌, బావ అల్లు అర్జున్ కూడా ఆమె చిత్రాల వేడుకలకు వచ్చి మంచి ప్రమోషన్ ఇచ్చారు. అయితే సరైన క‌థ‌లు ఎంపిక చేసుకోవడంలో ఆమె ఫెయిల్ అవడంతో ఆమె కెరీర్ స్టార్టింగ్ లోనే సక్సెస్ కాలేదు.

ఇప్ప‌టికే మూడు, నాలుగు సినిమాల్లో చేసినా ల‌క్ క‌లిసి రాక‌పోవ‌డంతో ఇప్పుడు ఆమె సినిమాల‌కు గుడ్ బై చెప్పేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసింద‌ట‌. ఇదే విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పేసిందని, అయితే వెబ్‌ సిరీస్‌లు మంచివి వస్తే మాత్రం చేయాలని డిసైడ్‌ అయిందని మెగా కౌపౌండ్ నుంచి వ‌చ్చిన గుస‌గుస‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు మాత్రం నిహారికి స‌పోర్టింగ్ రోల్స్‌తో అయినా మెప్పించే ఛాన్స్ ఉందంటున్నారు.

Leave a comment