ఎన్టీఆర్ కొమ‌రం భీం లుక్‌పై కాంట్ర‌వ‌ర్సీ..

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న R R R సినిమా ఇప్పుడు నేషనల్ మీడియాగా సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ తిరుగులేని అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లో యంగ్‌స్టార్స్‌గా ఉన్నా ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కే ఈ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ంగా… రామ్‌చ‌రణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ తన పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాడు.

తాజాగా లాయిడ్ తన ఇన్‌స్టా గ్రాం ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఓ వ్య‌క్తి లెగ్స్ మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా ఎన్టీఆర్‌వే అంటూ ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు. చాలా క‌ఠోరంగా లెగ్ ఎక్స్‌ర్ సైజులు చేసే వారి కాళ్లు ఎలా ? ఉంటాయో ? ఆ ఫొటోలో కాళ్లు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ ఫొటోపై అప్పుడే కాంట్ర‌వ‌ర్సీ స్టార్ట్ అయ్యింది.

ఎందుకంటే లాయిడ్ పోస్ట్ చేసిన ఫొటోలో కేవ‌లం కాళ్లు మాత్ర‌మే ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం లాయిడ్ పోస్ట్ చేశాడు క‌నుక అవి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫొటోలే అని చెపుతుంటే… మ‌రికొంద‌రు మాత్రం ఫేస్ లేకుండా కాళ్లను బ‌ట్టి ఎన్టీఆర్ ఫొటోలు అని ఎలా ? చెపుతారంటూ నెట్టింట్లో ఎదురు ప్ర‌శ్న‌లు రైజ్ చేస్తున్నారు. దీనిపై లాయిడ్ లేదా ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తే గాని ఆ ఫొటోలు ఉంది ? ఎన్టీఆరా ? కాదా ? అన్న‌ది తెలియ‌దు.

Leave a comment