ఆరంభంలోనే భార‌త్ దెబ్బ‌… సెమీస్‌లో కీవీస్ చెత్త రికార్డు..

ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో భాగంగా మంగ‌ళ‌వారం జ‌రుగుతున్న తొలి సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత పేస్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ – బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి ప‌వ‌ర్ ప్లే 10 ఓవర్లలో న్యూజిలాండ్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. ఇదిలా ఉంటే తొలి 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది. దీంతో మెగా టోర్నమెంట్లో తొలి 10 ఓవ‌ర్ల‌లో అతి త‌క్కువ ప‌రుగులు చేసిన చెత్త రికార్డు న్యూజిలాండ్ ఖాతాలో ప‌డింది.

ఇప్పటివరకూ ఇంగ్లండ్‌పై భారత్‌ చేసిన 28 పరుగులు పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉండగా, తాజాగా న్యూజిలాండ్ ఈ చెత్త రికార్డును బీట్ చేసి ఇప్పుడు త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ఈ నాకౌట్ మ్యాచ్‌లో భార‌త్ ఆశ్చ‌ర్య‌పోయే నిర్ణ‌యం తీసుకుంది. పిచ్ కండీష‌న్ నేప‌థ్యంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న నేప‌థ్యంలో మహ్మ‌ద్ ష‌మీని త‌ప్పించి ఆ ప్లేస్లో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజాను తీసుకున్నారు.

ఇక న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయేదే. బుమ్రా వేసిన బంతికి గ‌ఫ్టిల్ ఎల్బీపై భార‌త్ రివ్యూ తీసుకుని తొలి బంతికే రివ్యూ కోల్పోయింది. బంతి బ్యాట్‌, ప్యాడ్‌ను తాక‌డంతో తృటిలో గ‌ఫ్టిల్ అవుట్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది. బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో గప్టిల్‌ పెవిలియన్‌ చేరాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. 14 బంతులు ఆడిన గప్టిల్‌ పరుగు మాత్రమే చేశాడు.

Leave a comment