నాని ‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ టీజ‌ర్‌… ఖాతాలో మ‌రో హిట్‌ కాయం..

నేచురల్ స్టార్‌ నాని నటిస్తోన్న తాజా గ్యాంగ్‌ లీడర్‌ చిత్రం టీజర్‌ బుధవారం విడుదలైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకు విక్రమ్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో చూపించిన ఆ ఐదుగురిని(నాని పెన్సిల్ గ్యాంగ్‌) టీజర్‌ లో చూపించారు.

నానికి పెన్సిల్ గ్యాంగ్‌కు మ‌ధ్య జ‌రిగే క‌థాంశంతోనే ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. నాని గ్యాంగ్‌ లో ఉండే ఈ ఐదుగురు నాని ఇంట్లో దూరి మ‌నోడికి ఎలా చుక్క‌లు చూపెడ‌తార‌న్న క‌థాంశంతోనే ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. 1.20 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్‌లో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ కామెడీ ప్రాధాన్యంతోనే సినిమా తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది.

విక్ర‌మ్ కుమార్ గ‌త సినిమాల‌కు భిన్నంగా గ్యాంగ్‌లీడ‌ర్ ఉంటుంద‌న్న‌ది స్ప‌ష్టంగా తేలిపోయింది. ఈ పెన్సిల్ గ్యాంగ్ క‌త్తులు వెంటేసుకుని హ‌త్య‌లు చేస్తామ‌ని చెపుతుండ‌డం.. న‌న్ను రిలీజ్ చేయ‌మ‌ని నాని చెపుతుండ‌డాన్ని బ‌ట్టి చూస్తే డిఫ‌రెంట్ కామెడీతో నాని మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే గ్యాంగ్‌లీడ‌ర్‌ తొలి లిరికల్ పాటను విడుదల చేశారు. కాగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 20 లేదా 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a comment