ప్ర‌భాస్ దెబ్బ‌తో టాలీవుడ్‌లో క‌ల‌క‌లం..

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ముందుగా అనుకున్నట్లుగా సాహోను ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 30న చేస్తుండడంతో రిలీజ్ చేస్తుండడంతో ఆ ఎఫెక్ట్ మిగతా సినిమాల పై పడి మిగిలిన హీరోలతో పాటు దర్శక నిర్మాతలు సాహో యూనిట్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సాహో వాయిదాతో ముందుగా డేట్ లాక్ అయిన సినిమాలు తమ సినిమాల రిలీజ్ వాయిదా వేసుకోక తప్పటం లేదు.

రెండు పెద్ద సినిమాలు సాహో – సైరా మధ్యలో తక్కువ టైం ఉండటంతో… రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కువగా ఉండడంతో ఎవరు ఏ డేట్లు సర్దుబాటు చేసుకోవాలో తెలియక కిందామీదా పడుతున్నారు. సాహో వాయిదాతో వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ వాల్మీకి డేట్ మారింది. సాహో ఆగస్టు 15 నుంచి 30కి వెళ్లింది. దాంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేద్దామని డేట్ ప్రకటించిన వాల్మీకి సినిమాను మరోవారం వెనక్కు జరిపి సెప్టెంబర్ 13కు ఫిక్స్ చేశారు.

ఇదిలావుంటే ఆగస్టు 30న రావాల్సిన నానీస్ గ్యాంగ్ లీడర్ డేట్ కూడా మారుతుంది. అయితే అది సెప్టెంబర్ 20న లేదా 27న అన్నది తేలాల్సివుంది. ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గ్యాంగ్‌లీడ‌ర్‌కు సాహో పెద్ద షాకే ఇచ్చింది. ఇక అక్టోబ‌ర్ 2న సైరా ఉంది. దీంతో గ్యాంగ్‌లీడ‌ర్ మేక‌ర్స్ టెన్ష‌న్‌లో ఉన్నారు.
సెప్టెంబర్ అంటే పరీక్షల సీజన్ కనుక, దసరాకు దగ్గరగా రావడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నార‌ట‌. వీటితో పాటు కొన్ని చిన్న సినిమాల మేక‌ర్స్‌ కూడా సాహో – సైరాకు మ‌ధ్య‌లో న‌లిగిపోతామ‌న్న ఆందోళ‌న‌తో ఉన్నారు.

Leave a comment