మొన్న మహేష్ నిన్న ఎన్.టి.ఆర్.. పూరి పై ఫ్యాన్స్ ఫైర్..!

ఒక్క హిట్టు పడ్డదో లేదో పూరి ఇక తనని మించిన వాడు లేడన్నట్టు బిల్డప్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. దాదాపు మూడేళ్లుగా సరైన సక్సెస్ లు లేని పూరి రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవడంతో జోష్ లో స్టార్ హీరోల మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఈమధ్య ఇంటర్వ్యూలో మహేష్ తో జనగణమన సినిమా విషయమై తనకు ఓ క్యారక్టర్ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పూరి ఈసారి ఎన్.టి.ఆర్ ను టార్గెట్ చేశాడు.

ఎన్.టి.ఆర్ తో ఆంధ్రావాలా, టెంపర్ సినిమాలు చేసిన పూరి తారక్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని. టెంపర్ షూటింగ్ అయ్యాక ఓ రోజు తారక్ తో షూటింగ్ కు వెళ్లానని అతని డ్రైవింగ్ చూసి తనకు భయమేసిందని చెప్పాడు పూరి. అయితే పూరి చేసిన కామెంట్స్ కు నందమూరి ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. తమకి ఎప్పుడూ జాగ్రత్తలు చెప్పే ఎన్.టి.ఆర్ ఒకప్పుడు అలా చేసి ఉండొచ్చేమో కాని 2014 జానకి రామ్ మరణం తర్వాత తన పద్ధతి మార్చుకున్నాడని చెప్పుకొచ్చారు.

పూరి చేసిన కామెంట్స్ పూర్తిగా తన పర్సనల్ అయినా సరే అవి స్టార్ హీరోల ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. మరి పూరి ఎందుకు ఇలా స్టార్ హీరోలను గెలుకుతున్నాడో అర్ధం కావట్లేదు. ఇండస్ట్రీలో హిట్లు వచ్చిన వారికే ఛాన్స్ ఇస్తారన్న చిన్న లాజిక్ పూరికి తెలియదా మహేష్ కోసం 100 కోట్లు పెట్టే నిర్మాతలు రిస్క్ ఎలా చేస్తారని మహేష్ పై పూరి కామెంట్స్ చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

Leave a comment