ఇస్మార్ట్ శంకర్ హిట్.. బాధపడుతున్న హీరో!

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ దెబ్బతో చాలాకాలంగా ఫెయిల్యూర్‌లతో సతమతమవుతున్న పూరీ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. ఇక ఈ సినిమాతో హీరో రామ్ కూడా సక్సెస్ అందుకోవడమే కాకుండా తన కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్‌తో ఓ హీరో బాధపడుతున్నాడు.

పూరీ తొలుత ఈ సినిమాను తన కొడుకు ఆకాష్ పూరీతో తెరకెక్కించాలని చూశాడట. అయితే మాస్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో అతడు అంతగా సెట్ కాడనుకున్న పూరీ.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వద్దకు ఈ సినిమాను తీసుకెళ్లాడు. అప్పటికే పుట్టెడు ఫ్లాపులతో విలవిలలాడుతున్న తేజ్ పూరీ తీసుకొచ్చిన పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ కథ విన్నాక సారీ చెప్పాడు. తనకు ఇంతటి మాస్ ఓరియెంటెడ్ కథ సెట్ కాదేమోనని భయపడ్డాడు తేజు.

కట్ చేస్తే.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారిన ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసి ఇంతటీ హిట్ మూవీని అనవసరంగా వదులుకున్నానే అంటూ బాధపడుతున్నాడు తేజు. కానీ ఈ సినిమా అతడి చేతిలోకి వెళ్లుంటే తేజు కెరీర్‌లో అదిరిపోయే సక్సెస్ పడేది అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఫీల్ కావడం దేనికని వారు సలహా ఇస్తున్నారు.

Leave a comment