రాయలసింహాగా బాలయ్య సవాల్

నటరత్న బాలకృష్ణ చివరగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం వచ్చి చాలా రోజులే అవుతుంది. కానీ ఇప్పటివరకు బాలయ్య తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేయలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మూవీ ఎప్పుడా అని ఆతృతగా చూస్తున్నారు. కాగా జై సింహా చిత్ర దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో బాలయ్య తన నెక్ట్స్ మూవీని రెడీ చేయనున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

జైసింహా లాంటి పవర్‌ఫుల్ సినిమాను తెరకెక్కించిన రవికుమార్ ఈసారి కూడా అంతే పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు అంతకంటే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టాలని చూస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు ఎస్పీ రంజిత్ కుమార్ అని తెలియడంతో ఈ సినిమాకు అదే పేరు టైటిల్‌ అనుకున్నారట. కానీ ‘రూలర్’ అనే ఇంకో పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తు్న్నారు చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకు ‘రాయలసింహా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సినిమాకు ‘రాయలసింహా’ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. బాలయ్యకు సింహా సెంటిమెంట్‌ ఎంత వర్కవుట్ అవుతుందో మనందరికీ తెలిసిందే. మరి అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Leave a comment