ప్రో క‌బ‌డ్డీ…. ఆట కాదు…. ఎన్టీఆర్ వేట (వీడియో)

వివో ప్రో క‌బ‌డ్డీ లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా ? అని దేశవ్యాప్తంగా ఉన్న కబడ్డీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క‌బ‌డ్డీ స్టార్ట్ అయ్యాక మ్యాచ్‌లు జ‌రుగుతున్న టైంలో ప్ర‌తిఒక్క‌రు టీవీల‌కు అతుక్కుపోయి మ‌రీ మ్యాచ్‌లు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు దేశంలో క్రికెట్ మాత్ర‌మే ఎక్కువ ఆద‌ర‌ణ ఉండేది. ఎప్పుడైతే క‌బ‌డ్డీ స్టార్ట్ అయ్యిందో అప్పుడు దీనికి కూడా భారీ ఎత్తున ఆద‌రణ ల‌భిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ నెల 20 నుంచి ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజ‌న్‌ను మ‌రింత హిట్ చేసేందుకు నిర్వాహ‌కులు ఎన్టీఆర్‌తో ఓ వీడియో ప్రోమో డిజైన్ చేయించి వ‌దిలారు. ఎన్టీఆర్ షూటింగ్‌లో పైనుంచి కింద‌కు దూకుతాడు. వెంట‌నే డైరెక్ట‌ర్‌తో రేప‌టి షూటింగ్‌కు ఒరిజ‌న‌ల్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ దొరికారా ? అని అడుతాడు. అందుకు డైరెక్ట‌ర్ ఎందుకు సార్ మ‌నోళ్లు ఉన్నారుగా ? అని చెపుతాడు.

చూసేవాడికి అది ఆ టైం ఏమో కానీ ఆడే వాడికి అది వేట అని ఎన్టీఆర్ చెపుతాడు. అయినా డైరెక్ట‌ర్ మాత్రం అవ‌స‌రం లేదు సార్‌…. అదైనా దూక‌డ‌మే..ఇదైనా దూకుడ‌మే రెడీ షూటింగ్ స్టార్ట్ అంటాడు. వెంట‌నే ఎన్టీఆర్ క‌బ‌డ్డీ అంటూ డైరెక్ట‌ర్‌నో ఓ కుమ్ము కుమ్మ‌డంతో మ‌నోడికి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. చివ‌ర‌కు అస‌లు గేమ్‌లో ఓ ఆట‌గాడు ఓ గేమ్ ఆడి నీ వ‌ల్ల అవుతుందా ? అని చెప్ప‌డంతో డైరెక్ట‌ర్ నా వ‌ల్ల కాదంటాడు.

వెంట‌నే ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో చూసేవాడికి అది ఆ టైం ఏమో కానీ ఆడే వాడికి అది వేట అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఏదేమైనా ఎన్టీఆర్ క‌బ‌డ్డీకి మ‌రింత క్రేజ్ తెచ్చేందుకు చేసిన ఈ ప్రోమోతో పాటు డైలాగ్ కూడా అదిరిపోయింది. ఇక క‌బ‌డ్డీ అభిమానులు ఈ నెల 20 నుంచి ఎంజాయ్‌కు రెడీ అయిపోవ‌చ్చు.

Leave a comment