కుమారికి కుమ్మేసే ఛాన్స్ వచ్చిందా.. రష్మికకు గట్టి పోటీ..!

కుమారి 21ఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న హెబ్భా పటేల్ తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. ఈమధ్యనే 24 కిస్సెస్ అంటూ వచ్చినా అది కూడా తుస్సుమన్నది. లిప్ లాక్స్ విషయంలో పెదాలను రాసిచ్చే హెబ్భా పటేల్ కెరియర్ లో ఓ క్రేజీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. నితిన్ హీరోగా ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. భీష్మ టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో ఆల్రెడీ రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

ఓ పక్క సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా హెబ్భా పటేల్ నటిస్తుందట. రష్మిక మందన్న, హెబ్భా పటేల్ ఇద్దరి మధ్య నితిన్ నలిగిపోతాడట. ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ సో ఈసారి నితిన్ భీష్మ అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఛలో సినిమాతో సత్తా చాటిన వెంకీ భీష్మ అంటూ ఓ కొత్త కథతో వస్తున్నాడు.

శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ కొద్దిపాటి గ్యాప్ తో ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ భీష్మ సెట్స్ మీద ఉండగా చంద్రశేఖర్ యేలేటి సినిమా.. వెంకీ అట్లూరి సినిమా లైన్ లో ఉన్నాయి. మొత్తానికి నితిన్ స్పీడ్ పెంచాడని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a comment