బిగ్ బాస్3 పై హాట్ బ్యూటీ గాయత్రి పోలీస్ ఫిర్యాదు!

తెలుగు లో ఉయ్యాలజంపాల సినిమాతో పరిచయం అయిన నటి గాయత్రి తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా నటించిన గాయత్రికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే సినిమాల్లో కన్నా యూట్యూబ్స్ లో ఎక్కువగా కాంట్రవర్సీల్లో కనిపించే గాయత్రి తాజాగా బిగ్ బాస్ 3 పై సంచలన వ్యాఖ్యల చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్ షోకి తాను ఎంపిక అయ్యానని చెప్పి ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవద్దన్నారని, దీంతో ఆరు సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని తెలిపింది. తీరా, ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పారని ఆరోపించింది. అంత పెద్ద రియాల్టీ షో కనుక తాను కూడా సుమారు ఆరు ప్రాజెక్టు లు వదిలేశానని అన్నారు. తీరా, ఒక రోజు ఫోన్ చేసి సెలక్ట్ కాలేదని చెప్పారని ఆరోపించింది.

అభిషేక్, రఘు, రవికాంత్‌లు తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారని వివరించింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది. ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

షోకు ఎంపిక చేశారన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న ఆరు మూవీస్ ని అన్యాయంగా వదులుకున్నానని..ఆ నష్టపరిహారం ఇవ్వాల్సింగా షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి తెలిపింది.

Leave a comment