సైరాలో మళ్లీ మార్పులు.. మెగా మూవీపై ఫ్యాన్స్ అసంతృప్తి..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీని రాం చరణ్ నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుండి ఏదో ఒక విషయంలో మార్పులు చేస్తూనే ఉంది. ఈమధ్యనే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సైరా సినిమా నుండి సడెన్ గా మ్యూజిక్ డైరక్టర్ మారుతున్నట్టు తెలుస్తుంది.

అదేంటి సినిమా మొత్తం పూర్తయ్యాక మ్యూజిక్ డైరక్టర్ హ్యాండ్ ఇచ్చాడా అంటే.. సైరాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన కేవలం సాంగ్స్ వరకే మ్యూజిక్ ఇచ్చారట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం చిరంజీవి ఈమధ్య బాలీవుడ్ లో దూసుకెళ్తున్న జులియస్ కు ఆ ఛాన్స్ ఇచ్చారట. సల్మాన్ ఖాన్ భరత్ కు బిజిఎం తో అదరగొట్టిన జులియస్ సైరాకు ఆర్.ఆర్ అందిస్తాడని తెలుస్తుంది.

సైరా పోస్టర్ టైం లో తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తాడని అన్నారు. పోస్టర్ లో తమన్ ఆర్.ఆర్ కూడా అదిరిపోయింది. కాని అమిత్ ను ఫైనల్ చేశారు. ఇప్పుడు బిజిఎం కోసం మరో సంగీత దర్శకుడిని తీసుకున్నారు. ఆ ఛాన్స్ ఏదో తమన్ కు ఇస్తే బాగుండేది అని కొందరు అంటున్నారు. సినిమా మ్యూజిక్ తేడా కొడితే మాత్రం సైరాకు పెద్ద దెబ్బ పడినట్టే.

Leave a comment