ఆ సీన్లు లేకపోతే సినిమాలు చేయడా.?

ఈ రోజు విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘డీయర్ కామ్రెడ్’మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ సీన్లతో పాటు పిచ్చెక్కించేలాంటి లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా ఇదే అనిపిస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి రెచ్చిపోయాడు. అస‌లు ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత యూత్ అయితే ఊగిపోవ‌డం ఖాయం.

మ‌రోసారి అదే ఆవేశం.. అవే ముద్దులు.. అదే కాలేజ్ బ్యాక్ డ్రాప్.. శివ టైప్ కాలేజ్ పాలిటిక్స్ అన్ని క‌లిపి డియ‌ర్ కామ్రేడ్ రేంజ్ ఎక్క‌డికో పెంచేసాయి. అర్జున్ రెడ్డి తర్వాత ప్రతీ మూవీలోనూ సింబాలిక్‌గా లిప్‌లాక్ సర్వసాధారణమైంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని తలపించేలా ముద్దులతో వెండితెరను ముంచెత్తుతున్నాడు. ఇక తాజా లిప్‌లాక్‌తో హీరోయిన్ రష్మిక మందన్న రెండోసారి ఇబ్బందుల్లో పడింది. బ్రేకప్ ముందు.. తర్వాత ముద్దుల్లో మునిగిపోతున్నావు అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.

ఇక విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు క్రాంతి మాధవ్ ఓ సుదీర్ఘమైన లిప్‌లాక్‌ సీన్ డిజైన్ చేశాడట. ఈ సీన్ ఇప్పటి వరకు దక్షిణాది సినీ పరిశ్రమలోనే అతి సుదీర్ఘమైన ముద్దుగా నిలుస్తుందనేది తాజా సమాచారం. అయితే ఇప్పటి వరకు ముద్దులంటే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ గుర్తొచ్చేవారు. దక్షిణాదిని అంతగొప్పగా ముద్దులతో ముంచెత్తిన హీరో కమల్ హాసన్ అని చెబుతుంటారు… ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ ముద్దులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు.

Leave a comment