విజయ్ తో లిప్ లాక్స్.. పాపం రష్మిక చాలా కష్టపడ్డదట..!

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న తాను నటించిన ఓ సినిమా కోసం బాగా కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. ఇంతకీ అదే సినిమానో తెలుసా ఇంకెవరిది రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా కోసమే.. విజయ్, రష్మిక ఆల్రెడీ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

ఈ సినిమా కోసం రష్మిక చాలా కష్టపడ్డదట. సినిమాలో తనని క్రికెటర్ పాత్ర అని దర్శకుడు 10 నిమిషాల సీన్ కోసం తనతో 4 నెలలు క్రికెట్ నేర్పించారని.. ఇక డబ్బింగ్ కూడా తానే చెప్పుకున్నానని.. ఎవరైనా ఒక వారం 10 రోజుల్లో డబ్బింగ్ చెబుతారని కాని తాను 4 నెలలు డబ్బింగ్ చెప్పానని అన్నది రష్మిక. దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని అన్నది రష్మిక.

ఇక సినిమాలో విజయ్ తో అదరచుంభనాలు సర్ ప్రైజ్ చేశాయి. డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజైన దగ్గర నుండి సెన్సేషన్ గా మారింది. జూలై 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. బెంగళూరు, కేరళ, చెన్నై, వైజాగ్ ఇలా అన్ని ఏరియాలను కవర్ చేస్తూ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి ప్రత్యేకంగా డియర్ కామ్రేడ్ మ్యూజిక్ బ్రాండ్ పేరుతో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.

Leave a comment