‘నిన్ను వీడని నీడను నేనే’ రివ్యూ & రేటింగ్

సినిమా: నిను వీడని నీడను నేనే
నటీనటులు: సందీప్ కిషన్, అన్య సింగ్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, తదితరులు
డైరెక్టర్: కార్తిక్ రాజు
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: పీకే వర్మ
నిర్మాత: సందీప్ కిషన్

యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. కాగా తాజాగా తానే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ తెరకెక్కించిన హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘నిను వీడని నీడను నేనే’ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో జనాల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
రిషి(సందీప్ కిషన్), దియా(అన్య సింగ్) భార్యాభర్తలు. ఒకరోజు వారు ప్రయాణిస్తున్న కారు ఓ స్మశానం దగ్గరికి రాగానే యాక్సిడెంట్‌కు గురవుతుంది. అయితే ఈ ప్రమాదం నుండి వారు చిన్న దెబ్బలతో బయటపడతారు. కాగా ఇంటికి వచ్చిన రిషి, దియాలకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. తమను తాము అద్దంలో చూసుకుంటే వేరు వారి ప్రతిబింబాలు కనిపిస్తాయి. దీంతో అవాక్కయిన ఆ జంట.. తమకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటారు. ఇంతకీ ఆ ప్రతిబింబాలు ఎవరివి..? యాక్సిడెంట్‌లో వారు క్షేమంగా ఎలా బయటపడ్డారు..? ఆ ఆత్మల కథ ఏమిటి..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు కార్తిక్ రాజు ఎంచుకున్న ఈ హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంది. సాఫీగా సాగుతున్న భార్యాభర్తల జీవితంలో ఒక ప్రమాదం ఎలాంటి మలుపు తిప్పిందనే కథను కాస్త భయపెడుతూ చూపించాడు దర్శకుడు కార్తీక్ రాజు. ఫస్టాఫ్‌లో సందీప్, అన్యసింగ్‌ల మధ్య రొమాంటిక్ అంశాలను చూపిస్తూనే, వారిని భయపెడుతూ చూపించారు. కొన్ని సీన్స్‌లో వారి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌లో వేడి పుట్టిస్తుంది. ఇక ఒక అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

సెకండాఫ్‌లో ఆత్మల ఫ్లాష్‌బ్యాక్‌తో దర్శకుడు కాస్త బోర్ కొట్టించాడు. వారి కథలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఇక క్లైమాక్స్‌లో ఒక చిన్న అంశంతో కథను ముగించేశాడు డైరెక్టర్. ఏదేమైనా హార్రర్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను మెప్పించి హిట్ కొడదామని చూసిన సందీప్ కిషన్, దాన్ని అందుకోవడంలో మరోసారి ఫెయిల్ అయ్యాడు.

ఓవరాల్‌గా హార్రర్ సినిమాలంటే ఇష్టపడే ఆడియెన్స్‌కు నచ్చే ఈ సినిమా మిగతా ఆడియెన్స్‌ను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. కానీ సందీప్ కిషన్ చేసిన అటెంప్ట్‌‌ను మాత్రం మెచ్చుకోవాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సందీప్ కిషన్ యాక్టింగ్ పరంగా తనలోని నటుడిని బాగానే చూపించాడు. హార్రర్ సీన్లలో అతడి యాక్టింగ్‌కు జనాలు ఇంప్రెస్ అవుతారు. అయితే కొన్ని సీన్స్‌లో మాత్రం సందీప్‌ నటన ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్ అన్య సింగ్‌కు ఈ సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర లభించింది. హీరోయిన్‌ ఉండాలి కాబట్టి ఉంది అంతే. ఇక మిగతా నటీనటుల్లో పోసాని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రేక్షకులను అలరించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు కార్తీక్ రాజు ఎంచుకున్న హార్రర్ థ్రిల్లర్ కథ బాగానే ఉన్నా.. దాన్ని ఎలివేట్ చేసిన విధానం బెడిసి కొట్టింది. ఫస్టాఫ్‌లో కథను ఇంట్రెస్టింగ్‌గా చూపించిన ఈ దర్శకుడు అదే ఫ్లోను కంటిన్యూ చేయలేకపోయాడు. బోరింగ్ సెకండాఫ్‌తో దర్శకుడు సినిమాను ట్రాక్ తప్పించాడు. ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. ముఖ్యంగా హార్రర్ సీన్స్‌లో వచ్చే బీజీఎం సూపర్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా:
నిను వీడని నీడను నేనే – ఇది కూడా పాయే!
రేటింగ్:
2.0/5.0

Leave a comment