ఇండియా ఓటమితో ఫైనల్ టికెట్స్ రీ సేల్..!

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడే టీమిండియా సులువుగా ఫైనల్‌కు వెళ్లిపోతుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. దీనికి తగ్గట్టుగానే నెలన్నర రోజులపాటు ఇండియా జైత్రయాత్ర వరుసగా కొనసాగింది. లీగ్ మ్యాచ్లో 9 మ్యాచ్‌ల‌కు న్యూజిలాండ్‌తో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా ఓడిపోయింది. మిగిలిన ఏడు మ్యాచ్‌ల‌లోనూ తిరుగులేని ఘన విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికా – పాకిస్తాన్ – ఆస్ట్రేలియా ఇలా మ‌హామ‌హ జ‌ట్లు అన్నింటిని మట్టికరిపించింది. దీంతో ఇండియా సులువుగా సెమీ ఫైనల్ గండం అధిగ‌మించేసి ఫైన‌ల్‌కు వెళ్లిపోతుందని ఎవరికి వారే లెక్కలు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ నెల 14న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్లను ఇండియా అభిమానులు ఎప్పుడు బుక్ చేసుకున్నారు. లార్డ్స్ మైదానం మొత్తం సామ‌ర్థ్యం 30 వేలు కాగా… అందులో ఫైన‌ల్ మ్యాచ్‌కు సంబంధించి కేవ‌లం ఇండియా అభిమానులే 80 శాతం టిక్కెట్లు కొనేశారంట‌. దీనిని బ‌ట్టి మ‌న వాళ్ల‌కు ఇండియా ఫైన‌ల్‌కు వెళుతుంద‌ని ఎంత ధీమా ఉందో తెలుస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి ఇండియా సాధించిన విజ‌యాలు కూడా ఇందుకు కార‌ణం.

ఇక ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ చేతిలో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో ఫైన‌ల్ మ్యాచ్ చూసేందుకు ఇండియ‌న్స్ ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో ఇప్పుడు వాళ్లంతా త‌మ టిక్కెట్ల‌ను విక్ర‌యించేస్తున్నారు. అదే టైంలో ఆతిధ్య ఇంగ్లండ్ టీం ఫైన‌ల్‌కు వెళ్ల‌డంతో ఆ దేశ‌స్తులు మ్యాచ్‌ను చూసేందుకు టిక్కెట్ల కోసం ఎగ‌బ‌డుతున్నారు. దీంతో ఇప్పుడు ఇండియ‌న్లు అమ్మే టిక్కెట్ల‌కు ఇంగ్లండ్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది.

Leave a comment