బిగ్ బాస్ 3 : కొత్త లీస్ట్ బయటపెట్టిన నాగ్..!

బిగ్ బాస్ మూడో సీజన్ కి ముస్తాబు అవుతుంది. వచ్చే ఈ నెల మూడో వారంలో సీజన్ మొదలు కానుంది. అయితే మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్ 3 కి ఎవరు హూస్ట్ అన్న విషయం పై తెగ సందేహాలు వచ్చాయి. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, వెంకటేష్ ఇలా ఎంతో మంది పేర్లు వినిపించినా..చివరికి కింగ్ నాగార్జున కన్ఫామ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఇంటి సభ్యుల విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 2 ముగిసినప్పటి నుంచి రక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ మద్య నాగార్జున ప్రోమో లో 14 మంది కంటెస్టెంట్లు, 100 రోజు ఇంట్లో గడపాలి..మరి సామాను సరిపోతుందా అనడం చూశాం. అయితే ఈసారి కాస్త మసాలా డోస్ ఎక్కువే ఉండబోతుందని..ఇంటి సభ్యులు పాపులర్ సెలబ్రెటీలే అని చెప్పకనే చెప్పినట్లుంది.

మరోవైపు ఇంటి సభ్యులు లీస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి (జ్యోతి) , హీరో తరుణ్, మాస్టర్ రఘు , సింగర్ హేమచంద్ర , శ్రీ రెడ్డి , ఉదయభాను , వరుణ్ సందేశ్ , హాస్యనటుడు వైవా హర్ష , జాహ్నవి ఉన్నారని తెలుస్తుంది . అంతే కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ కూడా ఇందులో పాల్గొనబోతున్నరని తెలుస్తుంది . వీరే గనక ఇంటి సభ్యులు అయితే మాత్రం రచ్చ రంబోల అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.

Leave a comment