‘రాజ్ దూత్’ ట్రైలర్ అదిరింది..!

టాలీవుడ్ లో విలన్ గా కెరీర్ ప్రారంభించి తనదైన మార్క్ చాటుకున్న శ్రీహరి తర్వాత హీరోగా మారారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీహరి హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతూ వచ్చారు. రాంచరన్ నటించిన తుఫాన్ మూవీ ఆయన చివరి సినిమా. ముంబైలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో శ్రీహరి తనయుడు మేఘాంష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాజ్ దూత్’. తాజాగా ఈ మూవీకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అర్జున్ గున్నాల, కార్తిక్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

ఈ ట్రైలర్ లో ఓ యువకుడుకి రాజ్ దూత్ తీసుకు రమ్మని చెబుతాడు. అయితే ఆ రాజ్ దూత్ అంత ప్రత్యేకం ఏంటా అంటే అందులో డైమండ్స్ ఉంటాయి. ఈ విషయం హీరోకి తెలిసి తన స్నేహితులతో బయలుదేరుతాడు. ఆ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంతకీ ఆ రాజ్ దూత్ ని తీసుకు వస్తాడా..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా అన్నదే సినిమా. ఈ మూవీలో నక్షత్ర అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది.

‘పట్టుదల ఉన్నోడికి బట్టతలపై కూడా జుట్టు మొలిపిస్తాడు..ఓడిపోయే ఛాన్సు లేనోడు ఖచ్చితంగా గెలుస్తాడురా..కానీ గెలిచే ఛాన్స్ లేనోడు ఓడిపోకుండా ఉండటానికి ట్రై చేస్తాడర్రా అంటూ మేఘాంష్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘రాజ్ దూత్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a comment