Gossipsఅమీషాప‌టేల్ కి షాక్ ఇచ్చిన ముంబై పోలీసులు..

అమీషాప‌టేల్ కి షాక్ ఇచ్చిన ముంబై పోలీసులు..

నాలుగున్న‌ర ప‌దుల వ‌య్సుకు చేరువులో ఉన్నా కూడా ముంబై బ్యూటీ అమీషాప‌టేల్ ఇంకా పెళ్లి చేసుకోకుండా హాట్ హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వ‌దులుతూ తాను కూడా ఇంకా ఛాన్స్‌ల వేట‌లో ఉన్నాన‌ని హింట్లు ఇస్తూనే ఉంటుంది. హృతిక్‌రోష‌న్ డెబ్యూ మూవీ క‌హోనా ప్యార్ హై సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ (బ‌ద్రి) – మ‌హేష్‌బాబు (నాని) – ఎన్టీఆర్ (న‌ర‌సింహుడు) సినిమాల్లో న‌టించింది.

ఆ త‌ర్వాత కూడా అడ‌పాద‌డ‌పా ఇక్క‌డ కొన్ని సినిమాలు చేసినా ఆమెకు స‌రైన బ్రేక్ రాలేదు. సినిమాలు లేక ఖాళీగా ఉన్న అమీషా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో రోజూ త‌న హాట్ మాట్ ఫొటోలు పెట్టుకుంటూ కాల‌క్షేపం చేస్తోంది. తాజాగా అమీషా చిక్కుల్లో ప‌డింది. ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఓ సినిమా కోసం ఆమె అజ‌య్‌కుమార్ సింగ్ అనే ఫైనాన్షియ‌ర్ నుంచి మూడు కోట్ల రూపాయలు తీసుకుందట.

ఆ సినిమా మ‌ధ్య‌లో ఆగిపోవ‌డంతో ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ష‌రా మామూలుగా చెక్ ఇచ్చినా అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీంతో అజ‌య్ ఇప్పుడు కేసు పెట్ట‌గా… అప్పు క‌ట్ట‌నందుకు రాంచీ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన అమీషా కోర్టుకు హాజ‌రు కాక‌పోతే ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

అస‌లే సినిమా ఛాన్సులు లేకుండా హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పెట్టుకుని కాలం గ‌డుపుతోన్న ఈ ప‌వ‌న్‌, ఎన్టీఅఆర్‌, మ‌హేష్ హీరోయిన్‌కు ఈ కోర్టు క‌ష్టాలేంట్రా దేవుడా ? అని నెటిజ‌న్లు ఆమెపై జాలీ చూపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news