ఓ బేబీ అంటోన్న చరణ్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరో సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సమంత మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో దీన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు ఇతర భాష దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

అయితే తెలుగులో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను తానే స్వయంగా ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు చూస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసేందుకు సురేష్ బాబు, రానా చూస్తున్నారు. కాగా హిందీలో ఈ సినిమాలో నటించేందుకు స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ను సంప్రదించారట ఓ బేబీ చిత్ర యూనిట్. సమంత పాత్రను ఒక్క ఆలియా భట్ అయితే పర్ఫెక్ట్‌గా చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఇక ఈ సినిమాను నందినీ రెడ్డి స్వయంగా డైరెక్ట్ చేస్తుందా.. లేక వేరే దర్శకుడు ఎవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమా రీమేక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అటు ఆలియా భట్ బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూనే తెలుగులో తన మొదటి సినిమాగా RRR మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Leave a comment