రెజీనా ‘ఎవరు’.. గుట్టు బయటపెడతానంటున్న గూఢచారి

టాలీవుడ్‌లో ‘గూఢచారి’ వంటి సినిమాతో తన సత్తా ఏమిటో చూపిన హీరో కమ్ రైటర్ అడవి శేష్ తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ఈ సినిమాతో తన ట్యాలెంట్‌ ఏమిటో చూపించిన ఈ హీరో నెక్ట్స్ సినిమా ఏమిటని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో అడవి శేష్ రెడీ అయ్యాడు.

రెజీనా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు అడవి శేష్. ఈ సినిమాలో రెజీనా ఓ అద్దం ముక్కను చేతిలో పట్టుకుని చూస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో అడవి శేష్ సీరియస్‌గా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాకు అంతే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టాడు మనోడు. ఎవరు..? అనే టైటిల్‌లో సినీ జనాలలో మంచి ఆసక్తిని రేకెత్తించి. కాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమాకు ఎవరు అనే టైటిల్ పక్కాగా సూట్ అవుతుందని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. దీనికి ‘ఆల్ యాన్సర్స్ విల్ బి షాల్ బి క్వశ్చన్డ్’.. అనే క్యాప్షన్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మరి ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎలా మెస్మరైజ్‌ చేస్తుందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment